News
తెలంగాణ నెం.1గా ఉంది
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రహదారుల్లో తెలంగాణ అట్టడుగున ఉండేదని...హైవేల విస్తరణతో ఇప్పుడు దక్షిణాదిలో తెలంగాణ నెం.1గా ఉందని తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణలో జాతీయరహదారులు, విస్తరణపై కేసీఆర్ ప్రకటన చేశారు. జాతీయరహదారుల విషయంలో చాలా బాధపడ్డామన్నారు. తెలంగాణలో జాతీయ రహదారులను విస్తరించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి కోరామని, దీంతో తెలంగాణకు 2,776 కి.మీ. కొత్త జాతీయ రహదారులను కేంద్రం మంజూరు చేసిందని చెప్పారు. తెలంగాణలో హైవేల విస్తీర్ణం 5,303 కి.మీ. పెరగనుందన్నారు. 70 ఏళ్లలో చేయలేనిది తాము రెండున్నరేళ్లలో సాధించామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ అవసరాలకు ప్రస్తుత ఓఆర్‌ఆర్ ఏమాత్రం సరిపోదన్నారు. ఔటర్ వెలుపల మరో రింగ్‌రోడ్డు వేయాలని కేంద్రాన్ని కోరామని అందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. 1999లోనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించామని, 15ఏళ్ల సుదీర్ఘ పోరాటం తెలంగాణ ఉద్యమమన్నారు. తెలంగాణ వచ్చాక కరెంట్ కష్టాలు తీర్చామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 16వేల చెరువులను బాగుచేసుకున్నామని, నిండిన చెరువులను చూస్తే సంతోషం కలుగుతోందన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు ఇస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








